1 / 56

జాతీయ గ్రామీణ త్రాగునీటి వారోత్సవాలు తేది. 20.02.2014 నుండి 25.02.2014 వరకు

జాతీయ గ్రామీణ త్రాగునీటి వారోత్సవాలు తేది. 20.02.2014 నుండి 25.02.2014 వరకు. ఛైర్మన్ మరియు జిల్లా కలెక్టరు, జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ, నల్లగొండ. జలమే జీవము. నీటి వినియోగం : మానవుడు జాతి మనుగడ కొరకు,సమాజ సర్వతోముఖాభివృద్ధికి నీటిని ఈ క్రింది విధంగా వినియోగించుకుంటాడు.

laddie
Download Presentation

జాతీయ గ్రామీణ త్రాగునీటి వారోత్సవాలు తేది. 20.02.2014 నుండి 25.02.2014 వరకు

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. జాతీయ గ్రామీణ త్రాగునీటి వారోత్సవాలు తేది. 20.02.2014 నుండి 25.02.2014 వరకు ఛైర్మన్ మరియు జిల్లా కలెక్టరు, జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ, నల్లగొండ

  2. జలమే జీవము • నీటి వినియోగం: మానవుడు జాతి మనుగడ కొరకు,సమాజ సర్వతోముఖాభివృద్ధికి నీటిని ఈ క్రింది విధంగా వినియోగించుకుంటాడు. • ప్రాణ సంరక్షణ మరియు • కుటుంబ అవసరాలకు • వ్యవసాయం • పరిశ్రమలు • భూగోళం మూడు వంతులు నీటితో నిండి ఉంది.దీనిలో 3% మాత్రమే మంచి నీరు,97% ఉప్పునీరు. ఈ 3% నీటిలో కేవలం 0.26% మాత్రమే మానవాళి వినియోగానికి ఉపయోగకరము. ఈ నీరు భూఉపరితలములో నదులు,కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సులు మరియు భూగర్భజల రూపంలో ఉన్నది.

  3. నీళ్ళు - కొన్ని నిజాలు • వ్యవసాయం : • మనం పరిశుభ్రమైన నీటిలో 70 శాతం వ్యవసాయానికే వాడుతున్నాం. • ఒక కిలో బియ్యం పండించడానికి ఒకటి నుంచి మూడు క్యూబిక్ మీటర్ల నీరు కావాలి. • 1,000 టన్నుల నీటితో 1 టన్ను ధాన్యం పండించొచ్చు. • ప్రపంచంలో ఉన్న 240 మిలియన్ హెక్టార్ల పంట భూమిలో 30 మిలియన్ హెక్టార్లు ఉప్పుతో చౌడుగా మారాయి. కారణం అవసరానికి మించిన నీటిని వాడడమే. • 70 శాతం కాలుష్యం వ్యవసాయం ద్వారానే పుడుతుంది. • పరిశ్రమలు : • ప్రపంచంలో 22 శాతం నీరు పరిశ్రమలే వాడుతున్నాయి. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో 59 శాతం, అభివృద్ధి చెందని దేశాల్లో 25 శాతం. • 300 నుండి 500 మిలియన్ టన్నుల భారలోహాలు, సాల్వెంట్లు, విషపదార్ధాలు, వ్యర్ధాలు పరిశ్రమల్లోనుంచి పుడుతున్నాయి. • ఇంధనం : • ప్రపంచంలో 19 శాతం విద్యుచ్చక్తి, భారత దేశంలో 40 శాతం విద్యుచ్ఛక్తి హైడ్రోపవర్ (జల విద్యుత్) ద్వారానే పుడుతుంది.

  4. నీళ్ళు - సమస్యలు • భారత దేశంలో పట్టణాల గుండా పోయే అన్ని నదులు చాలా వరకు కాలుష్యమయమయ్యాయి. • పరిశ్రమల్లోంచి, పంట భూముల్లోంచి, ఇళ్ళలోంచి వ్యర్ధాలు నేరుగా చెరువుల్లోకి, నదుల్లోకి, సముద్రాల్లోకి చేరుతున్నాయి. • పరిశ్రమలు, పంటలు, ఇంటి వాడకం కోసం ఉపయోగించే నీళ్ళతో పెద్ద నదీప్రవాహాలు కూడా ఎండిపోతున్నాయి. • తడి నేలల్ని కూడా వ్యవసాయం కోసం, పరిశ్రమల అభివృద్ధి కోసం, పట్టణాల విస్తీర్ణం కోసం పొడిబార్చేస్తున్నాము. • పరీవాహక ప్రాంతాల్లో అడవుల నరికివేత వల్ల చెరువుల్లో మట్టి మేటలు వేస్తుంది. అంతే కాకుండా అడవుల నరికివేత వలన వర్షపాతం కూడా తగ్గిపోయింది. • మెట్ట ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడం, కరువులు రావడం ఒకవైపునుంచి ఉంటే వరదలతో తీర ప్రాంతాలు మునిగిపోతున్నాయి. • అడవుల నరికివేత, తడి నేలల నాశనం రెండూ తోడై కరువులు, వరదల మధ్య మనం ఇరుక్కు పోతున్నాం.

  5. నీళ్ళు – భారతదేశ పరిస్థితి • మన దేశంలో గంగా, బ్రహ్మపుత్ర తీరాల్లో భూమి పొరల్లో నీరు ఎక్కువ. దక్షిణాదిన ఉన్న గట్టి రాతి నేలల్లో భూగర్భ జలం తక్కువ. • మన దేశంలో నదుల్లో పారే మూడవ వంతు నీళ్ళు సముద్రాల్లోకి నష్టపోతున్నాం. • నదుల్లో ప్రవహించే 1869 క్యూబిక్ కిలోమీటర్ల నీటిలో 690 క్యూ.కి.మీ. వాడుకోవచ్చు, 432 క్యూ.కి.మీ. భూగర్భంలో దాచుకోవచ్చు. అంటే 25% నీరు (4 వ వంతు) భూగర్భంలో దాచుకోవచ్చు. • మనం ఇళ్ళలో వాడే నీళ్ళలో 70 శాతం, వ్యవసాయంలో వాడే నీళ్ళలో 50 శాతం భూగర్భం నుంచే తోడుకుంటున్నాం. • మన దేశంలో సగటున ప్రతి మనిషి అన్ని అవసరాలకి కలిపి 680 క్యూబిక్ మీటర్ల నీటిని వాడుతున్నాం. 6గురు ఉండే ఇంటికి 250 లీ నీరు అవసరం. • మన జనాభాలో 11 శాతం ఇళ్లకే పైపుల ద్వారా నీరు చేరుతున్నాయి. • మంచి పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాతో 65 శాతం డయేరియాతో వ్యాపించే మరణాలను, 55 శాతం శిశు మరణాలను ఆపవచ్చు. • 1,43,000 పల్లెటూర్లలో సరియైన నీటి సరఫరా వ్యవస్థ లేదు.

  6. నీళ్ళు – భారతదేశ పరిస్థితి • మన దేశంలో వాడే మొత్తం నీటిలో 84 శాతం వ్యవసాయానికి, 12 శాతం పరిశ్రమలకి వాడుతున్నాం (భూగర్భ, భూ ఉపరితల జలాలు రెండూ కలిపి) • భూమిలోంచి లాగే నీటిలో 90 శాతం వ్యవసాయానికి వాడితే, 6 శాతం ఇళ్ళలో అవసరాలకు వాడుతున్నాం. • 3.15 శాతం గ్రామీణ జనాభాకు మాత్రమే పారిశుద్ధ్య వ్యవస్థ ఉన్నది. • దేశంలో నగరాల్లో ఉండే 7.57 కోట్ల మందికి, పల్లెల్లో ఉండే 56.3 కోట్ల మంది ప్రజలకు ఎలాంటి మరుగుదొడ్ల సదుపాయంలేదు. • పెద్ద స్థాయిలో మనుషులు, జంతువులు, చెట్లనుంచి వచ్చే జీవ వ్యర్ధాలు నీటిలోకి చేరి మనల్ని అనారోగ్యం పాలు చేస్తున్నాయి.

  7. నీళ్ళు – ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి • మన రాష్ట్ర విస్తీర్ణం : 275 లక్షల చదరపు కిలోమీటర్లు • వృధాగా క్షీణించిన నేల : 115 లక్షల చ.కి.మీ. (42 శాతం) • రాష్ట్ర సగటు వర్షపాతం : 940 మిల్లీ లీటర్లు • వర్షపాత ఆధారాలు : నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాలు • నదులు : గోదావరి, కృష్ణా (పెద్ద నదులు), పెన్నా, వంశధార, నాగావళి. • ఏటా మన రాష్ట్రానికి వచ్చే నీళ్ళు : 9,130 టి.ఎం.సి.లు. • ఇందులో ఇరిగిపోయి ఆవిరి అయ్యే నీళ్ళు : 3,743 టి.ఎం.సి.లు. (41 శాతం) • భూమి మీద ప్రవహించే నీరు : 3,643 టి.ఎం.సి.లు. (40 శాతం) • నేలలో తడిగా చేరే నీరు (తడిపే నీరు) : 913 టి.ఎం.సి.లు.(10 శాతం) • భూగర్భంలోకి ఇంకే నీరు : 822 టి.ఎం.సి.లు. (9 శాతం మాత్రమే) • ఫ్లోరైడుల కాలుష్యం ప్రధానంగా నల్గొండ, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కడప జిల్లాల్లో ఉంది. • నైట్రేటుల కాలుష్యం నల్గొండ, విశాఖపట్నం, తూ.గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, ఖమ్మంల్లో తీవ్రంగా ఉంది.

  8. నీళ్ళు – నల్లగొండ జిల్లా పరిస్థితి • నల్లగొండ జిల్లా భౌగోళిక విస్తీర్ణం : 14 వేల 322 చ.కి.మీ. • మన జిల్లాలో 1980 లో బోరు బావుల సంఖ్య 2000 • 2013 లో బోరు బావుల సంఖ్య 5,22,000. • నల్లగొండ జిల్లాలో వ్యవసాయానికి మరియు • త్రాగునీటికి భూగర్భ జలాలే జీవనాధారం. • జిల్లా అటవీ విస్తీర్ణం భౌగోళిక విస్తీర్ణంలో 5.8% • మాత్రమే.(ప్రస్తుతం 2.1%మాత్రమే). • జిల్లా సాధారణ వర్షపాతం 752.6 ఎం.ఎం.(ప్రస్తుతం 560 ఎం.ఎం. మాత్రమే) • గత 10 సం.లలో వర్షపాతం అసాధారణ స్థాయిలో తగ్గి, కనిష్ట గరిష్ట • ఉష్ణోగ్రతలు పెరిగాయి. • ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి ఫ్లోరైడ్ సమ్మిళిత జలాలుగా మారి, • జిల్లా అంతటా వ్యాపించి, ప్రాణాంతక సమస్యగా మారి, జనబాహుళ్యం పై, • పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలపై విషప్రభావం చూపిస్తున్నది.

  9. నీటి ప్రాముఖ్యత • జీవులలో శారీరక, జీవ రసాయనిక సంబంధమైన చర్యలు నీటి వలన నిర్వహించబడతాయి. • నీరు మన శరీరంలోని కణాలను తడిగా మరియు సజీవంగా ఉంచుతుంది. • మన శరీరంలోని ద్రవాల కదలికకు నీరు అవసరం. • మనం తీసుకొనే ఆహారాన్ని జీర్ణక్రియకు అనువుగా నీరు గుజ్జుగా మార్చుతుంది. • నీరు మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. • శరీరంలో జీవకణాల ఎదుగుదలకు అవసరమయ్యే సోడియం, పొటాషియం, మరియు కాల్షియం మొదలగు లవణాలను కరిగించుకొని కణాలలోకి ప్రవేశించడానికి నీరు సహాయపడుతుంది. • మానవ శరీరంలోని వ్యర్ధాలు నీటి ద్వారా బయటకు విసర్జింప బడతాయి. • చెట్ల ఆకులకు అవసరమైన లవణాలు మరియు ఖనిజాలను భూమి నుండి గ్రహించి ఆకులకు అందిస్తుంది. • నీటి సహాయం లేకుండా చెట్లు ఆహారాన్ని తయారు చేసుకోలేవు. తయారు చేయబడిన ఆహారం చెట్టులోని ప్రతి భాగానికి నీటి ద్వారానే అందించబడుతుంది.

  10. సురక్షిత నీరు • స్వచ్చంగా, ఆహ్లాదకరంగా, రుచి, వాసన లేకుండా • ఉండాలి • చల్లగా, మృదులంగా ఉండాలి • నీటి మలినత్వం 10 ఎస్.టి.యు.(స్టాండర్డ్ • టర్బిడిటీ యూనిట్)లకుమించి ఉండరాదు • నీటిలో అభ్యంతరకరమైన హైడ్రోజన్ సల్ఫైడు • వాయువులు ఉండకూడదు • ఆమ్ల గుణం 6.5 నుండి 8.5 మధ్య ఉండాలి • వ్యాధి కారక సూక్ష్మ క్రిములు, హానికరమైన • బాక్టీరియా ఉండరాదు • మీకు తెలుసా: మానవుడి శరీర బరువులో 2/3 • శాతం నీరుఉంటుంది.ఇందులో ఎక్కువ శాతం • త్రాగునీటి ద్వారాలభ్యమవుతుంది.మానవుడి • మెదడులో 70%, రక్తంలో 83% నీరు ఉంటుంది.

  11. నీటి సంబంధ అనారోగ్యం • నీటి సంబంధ అనారోగ్యం మనకి నాలుగు రకాలుగా వస్తుంది. • మురికి నీరు త్రాగడంతో వచ్చే అనారోగ్యం • నీటిలో ఉండే పరాన్న జీవులు మన శరీరంలో చేరి పుట్టించే అనారోగ్యం • మురుగునీటిలో పుట్టి పెరిగే జీవులు పుట్టించే అనారోగ్యం • తక్కువ నీటి వాడకంతో వచ్చే అనారోగ్యం

  12. కలుషిత నీరు - దుష్పరిణామాలు • ఉపరితల జలాల కాలుష్య కారకాలు : • ఉపరితల జలాల్లో వైరస్, బాక్టీరియా, • ప్రోటోజోవా, హెల్మెన్త్ వంటి • సూక్ష్మజీవులు • పరిశ్రమలనుండి వచ్చే విష కారకాలు • మానవ వ్యర్ధాలు (మల మూత్రాలు) • వ్యవసాయంలో వాడే రసాయనిక • ఎరువులు • భూగర్భ జలాల కాలుష్య కారకాలు : • ఫ్లోరైడ్, ఆర్సినిక్, సెలీనియం, జింక్, కాల్షియం, • మెగ్నీషియం, సోడియం, పొటాషియం, క్లోరైడ్, • సల్ఫేట్, నైట్రేట్స్, ఐరన్, బైకార్బోనేట్స్ పరిమితికి • మించిన మోతాదులో ఉండడం. • మనుషులకు వచ్చే 80% వ్యాధులకు మూలం • కలుషిత నీరు త్రాగడమే.

  13. కలుషిత నీరు - దుష్పరిణామాలు • బ్యాక్టీరియా, వైరస్, త్రాగునీటి జలాశయాల్లో పెరిగే పరాన్న జీవుల ద్వారా సంక్రమించే • వ్యాధులు :

  14. త్రాగునీరు కలుషితం కాకుండా తీసుకోవలసినజాగ్రత్తలు • చెరువులో నాచు వంటివి పెరుగుదల ప్రారంభించినప్పుడే తొలగించాలి. • కాలువల ద్వారా చెరువులు నింపేటప్పుడు చెరువులో హానికర మలినాలు చేరకుండా జాగ్రత్త పడడం. • చెరువులో బట్టలు ఉతకడం, స్నానం చేయుట, చెరువు గట్టుపై మలమూత్ర విసర్జన చేయకుండా చూడడం. • బావులు, చేతి పంపుల సమీపంలో మరుగుదొడ్లు లేకుండా చూడడం. • చేతి పంపుల పరిసర ప్రాంతాల్లో నీరు, చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడడం. • గ్రామంలోని మంచినీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచడం, బ్లీచింగ్ పౌడర్ (50గ్రా./ 1000 లీ.) కలపడం.

  15. త్రాగునీరు కలుషితం కాకుండా తీసుకోవలసినజాగ్రత్తలు • పైప్ లైన్ లీకేజీలు అరికట్టడం. • కుళాయిలకు ప్లాట్ ఫారంలు నిర్మించడం, మురుగు నీరు పోవుటకు ఏర్పాట్లు చేయాలి.కుళాయిలు భూమికి రెండు అడుగుల ఎత్తులో ఉండేలా చూడడం. • మంచినీరు నిల్వ చేసే పాత్రలు, గ్లాసులు,కాడగరిటెలు శుభ్రంగా ఉంచడం. • మంచినీటిని పట్టేటప్పుడు, త్రాగేటప్పుడు చేతులు శుభ్రంగా ఉంచుకోవడం.

  16. నీటి పరిరక్షణ • చేతులు కడిగేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, వస్తువులు కడిగేటప్పుడు మరియు గృహ అవసరాలకు ఎంత అవసరమో అన్ని నీళ్లే వాడడం • కుళాయిలను, నల్లాలను రాత్రుల్లో, అవసరం లేనప్పుడు వదిలేయకుండా చూడడం • పంట భూముల్లో అవసరానికి మించి పంపులతో వదలిన నీరు మడులను దాటి తనతో పాటు ఎరువులు, పురుగుమందులు కూడా వృధాగా బయటికి పారించేస్తుంది. అలా చేయకూడదు. • చెరువుల పై ప్రాంతంలో చెట్లు, గడ్డి పెంచడం వలన వర్షాలు వచ్చినపుడు చెరువుల్లో మట్టి పూడికను నియంత్రించ వచ్చును. • ఉపరితల జలాలను పెంచుటకు గ్రామంలోని చెరువులు,కుంటలను మరమ్మతులు చేయుట, పూడిక తీయుట • గృహాలలో, కాలనీలలో, పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో వాననీటిని సేకరించి దాచుకునే వ్యవస్థ (కందకాలు / ఇంకుడు గుంతలు)నెలకొల్పాలి. • చెట్లను పెంచడం. • ఇళ్ళలో, ఇంటిబయట నల్లాలు, పైపులైన్లు వారానికి ఒకసారి చెక్ చేసుకుని, లీకేజీలు ఉంటే అరికట్టాలి.

  17. నీటి పరిరక్షణ • ఇళ్ళలో వాడుకునే నీళ్ళు, మురుగునీరు వృధాగా పోకుండా నీళ్ళను పెరట్లోకి మళ్ళించడం. • నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములలో ఊటకుంటలు నిర్మించడం. • జల సంరక్షణ పనులను చేపట్టడం, తద్వారా భూగర్భ నీటి వనరులను • పెంచడం. • ప్రతి బోరు యజమాని కనీసం 2 ఎకరాల క్యాచ్ మెంట్ ఊట కుంటలు, ఫారం • ఫాండ్స్ నిర్మించాలి. • ప్రతి గృహంలో, వ్యవసాయ భూములలో, పడావు భూములలో • జామ,ఉసిరి,మునగ,కరివేపాకు,బొప్పాయి మొక్కలను విస్తృతంగా నాటి, • పెంచాలి. • ప్రభుత్వ ఖాళీ భూములు, ప్రభుత్వ సంస్థలలో మొక్కలు,మర్రి, రాగి, మేడి, • వేప వంటి వృక్షాలను పెంచాలి. • మెట్ట ఉద్యాన తోటల పెంపకాన్ని చేపట్టాలి. • గట్లు లేక కట్టలు కట్టడం • నేలల్లో చాళ్ళు చేయడం • చెక్ డాంలు నిర్మించడం. చెరువులు, గుంటలు తవ్వడం.

  18. నీటి సంరక్షణ ఇంకుడు గుంతలు నిర్మించడం చెక్ డ్యాములు నిర్మించడం కుంటలు, చెరువులు అభివృద్ధి చేయడం, చెట్లను పెంచడం ,NREGS ద్వారా కాలువలు, కుంటలు, చెరువుల్లో పూడిక తీయడం

  19. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ - కారణాలు • భూగర్భ రాతి పొరలలో సహజ సిద్ధంగా ఎక్కువ మోతాదులో నిక్షేపమై ఉండడం. • అటవీ విస్తీర్ణం, వృక్ష సంపద తగ్గడం(5.8%) • కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం మూలంగా వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు అడుగంటడం. • విచక్షణారహితంగా బోరుబావులను త్రొవ్వి, భూగర్భ జలాలు వినియోగించడం. • వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయకపోవడం. • నీరు అధికంగా అవసరమయ్యే వరి వంటి పంటలను ఎక్కువ విస్తీర్ణంలో భూగర్భజల వనరుల క్రింద సాగు చేయడం. • చెరువులు, కుంటలు మరియు చిన్న నీటి వనరుల పునరుద్ధరణ చేపట్టక పోవడం. • ఆరుతడి పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేయకపోవడం.

  20. ఫ్లోరోసిస్ వ్యాధి రకాలు-పరిణామ క్రమము • పరిమితికి మించిన ఫ్లోరైడ్ కలిగిన నీరు త్రాగుట ద్వారానే కాకుండా, మనం తీసుకునే ఆహారం ద్వారా, ఫ్లోరైడ్ గల నీటితో పండించిన ఆహార ఉత్పత్తుల ద్వారా ‘ఫ్లోరోసిస్’ వ్యాధి వస్తుంది. • ఫ్లోరైడ్ తీసుకునే పరిమాణాన్ని బట్టి ఫ్లోరోసిస్ వ్యాధి రకాలు:

  21. ఫ్లోరోసిస్ వ్యాధి రకాలు - పరిణామ క్రమము దంతాల ఫ్లోరోసిస్ ఆస్టియోఫ్లోరోసిస్ అస్థిపంజర ఫ్లోరోసిస్

  22. ఫ్లోరోసిస్ వ్యాధి రకాలు - పరిణామ క్రమము థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగించడం పెరుగుదల మందగించడం మూత్ర పిండాలు, గుండె పని చేయకపోవడం

  23. ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించడం • ఫ్లోరోసిస్ వ్యాధికి ఇంతవరకూ ఖచ్చితమైన చికిత్స పద్దతులు కనుగొనలేదు. కావున నివారణ ఒక్కటే మార్గం. • వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారపు అలవాట్లు మరియు తీసుకునే ఆహారంలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్-సి లతో కూడిన సమతుల్య పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఫ్లోరోసిస్ బారిన పడకుండా ఉండవచ్చు. • ఉదా: పంజాబ్, హర్యానా (14 మి.గ్రా./లీ. నీరు) • ప్రయోగశాలల్లో (ల్యాబ్) పరీక్షించుట: • మూత్రముమరియు రక్తమును పరీక్షించుట • ద్వారా వ్యాధి నిర్ధారణ • పళ్ళ మీద పసుపు, నలుపు, గోధుమ రంగులలో • చారలు కనబడుట

  24. ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించడం • ఎముకల ఫ్లోరోసిస్ ను గుర్తించుట : • నాణెము పరీక్ష (Coin test) • మనిషి మోకాలు వంచకుండా క్రింద పడిన • నాణెం తీసుకుంటే ఫ్లోరోసిస్ లేనట్లే. మోకాలి • నొప్పి ఉంటే ఫ్లోరోసిస్ సోకినట్లు అనుకోవచ్చు. • స్ట్రెచ్ పరీక్ష (Strech test) • రెండు చేతులు మోచేతి దగ్గరకు వంచి తల • వెనుక పెట్టేటప్పుడు భుజములో బాధ గానీ, • నొప్పి గానీ ఉంటె ఫ్లోరోసిస్ ఉన్నట్లు లెక్క. • గదుమ పరీక్ష (Chin test) • గడ్డము రొమ్ముకు ఆనించినప్పుడు నొప్పి • ఉంటే ఫ్లోరోసిస్ ఉన్నట్లు లెక్క • సాధారణ వ్యక్తి - ఫ్లోరోసిస్ సోకిన వ్యక్తి

  25. ఫ్లోరోసిస్ – నివారణ మార్గాలు – త్రాగు నీరు • త్రాగునీరు : • సురక్షితమైన శుద్ధి చేసిన (ఫ్లోరైడ్ రహిత) మంచినీరు • త్రాగడం(Reverse Osmosis Technology) • కృష్ణా జలాలసరఫరా ఉంటె తప్పక కృష్ణా జలాలనే త్రాగాలి • ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన (0.5 – 1.5 పి.పి.ఎం.) • ఫ్లోరైడ్ కలిగిన మంచినీటి చేతిపంపుల నీరు త్రాగడం. • భూగర్భ నీటి వనరులు కాకుండా, అందుబాటులో ఉన్న ఉపరితల జలాలు ఉపయోగించడం. • వ్యవసాయదారులు పొలం పనిపై ఉన్నప్పుడు బోర్ల నీటిని • త్రాగకుండా ఇంటివద్ద నుంచే సురక్షితమైన మంచినీటిని • తీసుకువెళ్ళడం.

  26. ఫ్లోరోసిస్ – నివారణ మార్గాలు - ఆహారం మట్టి పాత్రలు స్టీలు పాత్రలు ఇండాలియం పాత్రలు • ఆహారం : • తినే తిండి, పండే పంట, వండే వంట కూడా ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం • అవుతున్నాయి. • ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో మట్టి పాత్రలు(అన్నం • కుండలు, కూర అటికెలు),ఇండాలియం, స్టీల్ పాత్రలు • మాత్రమే వంటకు ఉపయోగించాలి.

  27. ఫ్లోరోసిస్ – నివారణ మార్గాలు - ఆహారం • ఆహారం :కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి,ఇ లు కలిగిన కూరగాయలు, పండ్లు, జీవక్రియ రక్షకాలు తీసుకోవాలి. • పాలు పెరుగు బెల్లం పళ్ళు,కూరగాయలు పచ్చటి ఆకుకూరలు జీలకర్ర మునగకాడలు కరివేపాకు

  28. ఫ్లోరోసిస్ – నివారణ మార్గాలు - ఆహారం పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, ఉసిరి, జామ, బొప్పాయి, నిమ్మ, నారింజ, టమాట, చింతపండు, వెల్లుల్లి, చిలగడ దుంప, ఉల్లి, పచ్చిమిర్చి

  29. ఫ్లోరోసిస్ – నివారణ మార్గాలు – చేయకూడనివి టీ త్రాగరాదు ఫ్లోరైడ్ పేస్టులను వాడరాదు, పిల్లలు పేస్టును మింగరాదు ఫ్లోరైడ్ నీరు త్రాగరాదు ఆనీటితో వండిన పదార్ధాలు తినరాదు పాన్ పరాగ్, రాక్ సాల్ట్, పొగాకు ఉత్పత్తులు వాడరాదు

  30. సంపూర్ణ పారిశుద్యం – సురక్షితమైన త్రాగునీరు – కావాలి మనందరి లక్ష్యం ప్రజారోగ్యాన్ని అతలాకుతలం చేయడంలో పారిశుద్యం మరియు త్రాగునీటి పాత్ర అనిర్వచనీయం. స్వాతంత్ర్యం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా మలవిసర్జనకై అరుబయటకి వెళ్ళడం ఎంతైనా శోచనీయం, కనుకనే మహాత్మాగాంధీ గారు “స్వాతంత్ర్యం కన్నా పారిశుద్యం మిన్న“ అన్నారు.

  31. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం కుటుంబాలు 8.75 లక్షలు • వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యం కలిగి ఉన్న కుటుంబాలు 3.56 లక్షల (కేవలం 41% కుటుంబాలు మాత్రమే) • మిగిలిన 59% కుటుంబాల వారు బహిర్భూమిలో మలవిసర్జన గావించుట వలన పర్యావరణం మరియు త్రాగునీటి వనరులు కలుషితమై ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. • ఈ కారణంగా పేద ప్రజలు జిల్లాలో తమ కష్టార్జితంలో ఎక్కువ భాగం ఆరోగ్య పరిరక్షణకు ఖర్చు చేయవలసి వస్తున్నది. • ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకం లేకపోవడం వలన కలిగే అనారోగ్యం వలన మరణిస్తున్నారని తెలియజేస్తున్నాయి. • అలాగే ప్రతి కుటుంబం పారిశుధ్య లోపం వలన కలిగే అనారోగ్యంపై సంవత్సరానికి సగటున పదివేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు

  32. మీకు తెలుసా ! బహిరంగ మలవిసర్జన వలన ఎన్ని సమస్యలో ? • మన గ్రామాలలో రోజుకు సగటున ప్రతిరోజూ ప్రతి గ్రామంలో 3 క్వింటాళ్ళ మలం వెలువడుతుంది. ఇది వాతావరణ, జల కాలుష్యానికి దారి తీస్తుంది. • ఈ మలంలో 1% మన ఆహార పానీయాల్లో చేరితే, సుమారు 3 గ్రాముల మలం రోజూ ప్రతి మనిషి తినే ఆహారంలో కలుస్తున్నట్లు లెక్క. అంటే రోజుకు ఒక చాక్లెట్ తో సమానం. • ఒక గ్రాము మలంలో ఒక కోటి వైరస్ లు, పది లక్షల బ్యాక్టీరియాలు, పది వేల పరాన్న జీవుల సిస్టులు, వంద పరాన్న జీవుల గ్రుడ్లు ఉంటాయి. • బయటి ప్రదేశాలలో మలవిసర్జన కొరకు గ్రామములో స్త్రీలు ఎక్కువగా శ్రమ పడుచున్నారు. • చీకటి సమయం వరకు వారు వేచి ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుచున్నవి. అందువలన వారు మానసికంగానూ, శారీరకంగానూ అనేక ఒత్తిడులకు లోనై అనేక వ్యాధులకు గురి అగుచున్నారు. • బహిరంగ మలవిసర్జన వలన మహిళల గౌరవానికి భంగం కలగడమే కాకుండా, ఆత్మ న్యూనత ఏర్పడుతుంది. • ఎక్కువ దూరం వెళ్ళడం వలన సమయం వృధా అవుతుంది. మరియు ఆరు బయట విషకీటకముల ప్రమాదం ఉంటుంది.

  33. మీకు తెలుసా ! బహిరంగ మలవిసర్జన వలన ఎన్ని సమస్యలో ? • పాఠశాలల్లో మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడం వలన చాలా మంది బాలికలు చదువు మానేస్తున్నారు. • బహిరంగ మల, మూత్ర విసర్జన సామాజికంగా వెనుకబాటు తనానికి సూచన. • మగవారు ఎక్కువగా గ్రామాలలోని పొలాలు, గుట్టలు, వాగులు, కుంటలు, చెరువు గట్టున, పొదల చాటున, రహదారి వెంబడి మల విసర్జన చేయడం వలన ఆ ప్రదేశము, అక్కడి నీరు కలుషితమై గ్రామ వాతావరణం దుర్భరంగా ఉంటుంది. • చిన్న పిల్లలైతే వారి ఇంటి ముందు గాని, మురికి కాల్వల్లో గాని, వీధుల్లో గాని మల విసర్జన చేస్తారు. ఈ కారణంగా చిన్న పిల్లలు తొందరగా వ్యాధి గ్రస్తులవుతారు. • ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడైతే, ఆ వ్యాధి సంబంధ సూక్ష్మక్రిములు ఆ వ్యక్తి మల, మూత్రాలతో బయటికి వస్తుంటాయి. • ఇవే కాకుండా గ్రామాలలోని చెత్తా చెదారాలను, పెంట కుప్పలను ఆవాసాలకు, గృహాలకు సమీపంలో వేయడం వలన, మురుగు కాల్వలను శుభ్రం చేయకపోడం, మురుగునీరు నిల్వ ఉండడం వలన కూడా అనేక ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి.

  34. మీకు తెలుసా ! బహిరంగ మలవిసర్జన వలన ఎన్ని సమస్యలో ? • బహిరంగ మల,మూత్ర విసర్జనల వల్ల విరేచనాలు, ధనుర్వాతము, కలరా, క్షయ, టైఫాయిడ్, కామెర్లు, మెదడువాపు వ్యాధి, చర్మ వ్యాధులు వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. • ఆరు బయట మలము, అపరిశుభ్ర ప్రదేశాలు పందులను ఆకర్షించుచున్నవి. • మెదడు వాపు వ్యాధి కల్గించు బ్యాక్టీరియాలు పందులకు ఆవాసాలు. మురికి ప్రదేశాలలోని దోమలు పందులను కుట్టి మన పిల్లలను కుడితే 14 సం.ల లోపు పిల్లలకు మెదడు వాపు వ్యాధి సంక్రమిస్తుంది. • ఎండాకాలంలో కంటే వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. • బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేసినప్పుడు వర్షపు నీటి ద్వారా మలం భూమి పైన, భూమి లోపల ఉన్న మంచినీటి వనరులను కలుషితం చేస్తాయి. • వ్యాధి ప్రబలడం వలన మనిషి ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా, చిన్న పిల్లలు మరణించడం, వ్యాధి నివారణల కోసం వ్యక్తి గతంగానూ, ఆర్ధికంగానూ నష్టపోవడం జరుగుతున్నది. • గ్రామాల్లో మరుగుదొడ్లు వాడని వారి వలన రకరకాల వ్యాధి కారకుల వలన మరుగుదొడ్లు వాడే వారు కూడా వ్యాధిగ్రస్తులవుతున్నారు.

  35. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారము ఒక్కటే అది మరుగుదొడ్లను నిర్మించుకొని, వాడడం • ఇందుకు గాను ప్రభుత్వం “ నిర్మల్ భారత్ అభియాన్ “ పథకం ద్వారా ప్రతి ఇంటికి, పాఠశాలల్లో, అంగన్వాడీలలో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టుట జరుగుచున్నది. • ఈ పథకం ద్వారా గృహాలలో నిర్మించుకునే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకాన్ని కూడా జత చేస్తూ రూ.10,000/- ఇవ్వడం జరుగుతుంది. • మన జిల్లా కలెక్టరు గారు త్రాగునీరు, పారిశుధ్యం కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ, ప్రత్యేకంగా మన జిల్లాలో బహిరంగ మల విసర్జన అనే సాంఘిక దురాచారాన్ని రూపుమాపి, ప్రజలందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని, ఉపయోగించుకొనేలా, పారిశుద్యాన్ని పాటించేలా, రక్షిత త్రాగునీటిని పొందేలా అవగాహన కల్పించి, ప్రోత్సహించేందుకు “మన కోసం మనం” కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడం జరుగుతున్నది.

  36. మన కోసం మనం కార్యక్రమము ద్వారా పారిశుద్యం మరియు త్రాగునీరులపై నిర్వహించే కార్యక్రమాలు • వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వాడకం : • వంద రోజుల్లో ఒక లక్ష వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం ప్రధాన లక్ష్యం. • గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటైన గ్రామ పారిశుధ్య కమిటీలు పారిశుద్యంపై ప్రజలకు నిరంతర అవగాహన కల్పించడం. • వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించే విధానాన్ని గ్రామంలోని తాపీ మేస్త్రిలకు శిక్షణనివ్వడం.

  37. మన కోసం మనం కార్యక్రమము ద్వారా పారిశుద్యం మరియు త్రాగునీరులపై నిర్వహించే కార్యక్రమాలు • పాఠశాలలో పారిశుద్యం : • విద్యార్దులకు వ్యక్తిగత, పాఠశాల, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం వలన వచ్చే అనర్ధాలను వివరించడం. • విద్యార్ధులకు బహిరంగ మలవిసర్జన వలన కలిగే అనర్ధాలను వివరించి వారి ద్వారా వారి తల్లిదండ్రులకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం ల ఆవశ్యకతను తెలియజేసేటట్లు చూడడం. • పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలోని మరుగుదొడ్లు తప్పక ఉపయోగించేలా, పరిశుభ్రంగా నిర్వహించేలా చూడడం. • ఆహారం తినే ముందు, మల,మూత్ర విసర్జనల తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కునేలా చూడడం.

  38. మన కోసం మనం కార్యక్రమము ద్వారా పారిశుద్యం మరియు త్రాగునీరులపై నిర్వహించే కార్యక్రమాలు • గ్రామ పారిశుద్యం: • బహిర్భూమిలో మల విసర్జన పూర్తిగా నిషేధించేలా చర్యలు చేపట్టడం. • మురుగు కాల్వలు శుభ్రపరచుకోవడం, చెత్తాచెదారాలను, పెంట కుప్పలను ఆవాసాలకు దూరంగా వేసేలా చర్యలు చేపట్టడం. • మురుగు కాల్వల వసతి లేకపోయినచో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చూడడం. • ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యార్డుల నిర్మాణం చేపట్టడం.

  39. మన కోసం మనం కార్యక్రమము ద్వారా పారిశుద్యం మరియు త్రాగునీరులపై నిర్వహించే కార్యక్రమాలు • గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకొని, ఉపయోగిస్తూ, ఇంటి మరియు గ్రామ పరిసరాలు పరిశుభ్రముగా ఉంచుకొని, బహిరంగ మల విసర్జన పూర్తిగా నిషేధించిన గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందించే “నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డు” కు ఎంపిక చేయుటకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది.

More Related