0 likes | 8 Views
This information is about food but this is the telugu language. If you want to know the meaning then consult the Indians who speak telugu.
E N D
బిడ్డలారా నేను మీ అన్నమును. ప్రతి రోజు నేను మీ ఆకలి తీరుస్తున్నాను. మరి మీరు ఈమధ్య నాగురించి రకరకాల విమర్శలు చేస్తున్నారు. అది ఏమిటి అన్నం గురించి విమర్శలా? అని అనుకుంటున్నారా? అయితే వినండి.
విమర్శలు • అన్నం తినడం వలన గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతాయి. • అన్నం తినడం వలన డయాబెటిస్ వస్తుంది. • అన్నం తినడం వలన బాడీ వెయిట్ పెరుగుతుంది. • అన్నం తినడం వలనబొజ్జ వస్తుంది.
మీరు చేస్తున్న విమర్శలు ఇవి. మరి మీకు ఒక విషయం తెలుసు. అది ఏమిటి అంటే ఒక వేలు మీరు ఎదుటి వ్యక్తి పై చూపితే నాలుగు వేళ్ళు మీ వైపు చూపుతాయి అని. మరి మీ నాలుగు వేళ్ళు మీకు ఏమి చెబుతున్నాయో చూడండీ.
అన్నము అడిగే నాలుగు ప్రశ్నలు? • మీలో ఎంత మంది రోజూ వ్యాయామం చేస్తున్నారు? • మీలో ఎంత మంది రోజూ వాహనము లేకుండా నడుస్తున్నారు? • మీలో ఎంత మంది రోజూ ఆటలు అడుతూఉన్నారు? • మీలో ఎంత మంది మీ ఇంటి పనులలో పాల్గొంటున్నారు?
సమాధానములు • లేదు • లేదు • లేదు • లేదు
మరి మీ సమాధానము లేదు అన్నప్పుడు మరి నన్ను విమర్శించి ఏమి లాభము? • అయితే సమాధానము వినండి. ముందు నా గురుంచి వదిలివేయండి. మీరు ఎంతో ఇష్టంగా నడుపు తూ ఉంటారుగా టూవీలర్ బైక్ ముందు దాని గురించి చెప్పుకుందాం.
మీ టూవీలర్ బైక్ లో పెట్రోల్ ఎంత అవసరమో అంతే మీరు కొట్టిస్తారు. మీరు తిరిగే దూరమును బట్టి ఇంకా మీరు పెట్టగలిగే డబ్బులు బట్టి.
అదే మీరు పెట్రోల్ కొట్టించి అస్సలు నడపకుండా నెల రోజులు స్టాండ్ లోనే పెట్టారు అనుకోండి అప్పుడు పెట్రోల్ కాస్త ఏమౌతుంది ఒకసారి ఆలోచించండి. బాగా ఓలటైల్ గా ఉండ వల్సిన పెట్రోల్ సస్పెన్షన్ గా మారి ఇంజిన్ 40 -50కిక్స్ ఇస్తే కానీ స్టార్ట్ కాదు.ఇంజిన్స్టార్టింగ్ ప్రాబ్లెమ్ వచ్చేస్తుంది.
ఇప్పుడు చెప్పండి ఒక బైక్ కేవలం నడపక పొతే ఇంజిన్ ట్రబుల్ ఇస్తే! మరి శరీరానికి కావాల్సిన ఇంధనమైన నన్ను మీరువినియోగించకపోతే మీరు చేసే విమర్శలే మీకు నిజమౌతాయి.
కాబట్టి మీరు అన్నమునుసరిగ్గా వినియోగించాలి. • మీరు కూడా శ్రమకు తగిన అన్నము మాత్రమే తినండి. • అతిగా తిన్నా దానికి తగినట్టు శ్రమను శరీరానికి కలిగించండి. లేకపోతే అన్నముతక్కువ తినండి.
మరి బిడ్డలారా! ఇప్పుడు చెప్పండి లోపం నాలో ఉందా? లేక మీలో ఉందా?. • ఎంత తింటున్నాము అని కాదు ప్రశ్న ఎంత తిన్నది జీర్ణము చేస్తున్నాము అన్నది ప్రశ్న? • ఎంత శ్రమ చేస్తామో అంత చక్కగా జీర్ణమవుతుంది బలము వస్తుంది.
శ్రమ అనగా మీ శరీరానికి చమట పట్టేంతగా శ్రమ చేయండి. మన చర్మం ఒకానొక excretory organ అని మీకు తెలుసా! • మనలో ఒక రైనా వస్తాదులు కానీ యోగ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ ఎప్పుడు ఏ రోగంతో బాధ పడరు. • కారణం వాళ్ళు నిత్యం ఎదో ఒక పని చేస్తూ వ్యాయామము చేస్తూ ఉంటారు.
ఏక భుక్తం మహా యోగి ఒకసారి తినేవాడు యోగి • ద్వి భుక్తం మహా భోగి రెండుసార్లు తినేవాడుభోగి • త్రి భుక్తం మహా రోగి మూడు సార్లుతినేవాడురోగి పై చెప్పిన వారిలో మీరు ఏమికావాలో మీరే నిర్ణయించుకోండి. మరి నన్ను అన్నం పరబ్రహ్మస్వరూపం అని మీరే అంటారు. మరి మీరు మీ తప్పులు తెలుసుకోకుంకుండా విమర్శలు చేయడం ఎంత వరకు న్యాయం.
అన్నమో రామచంద్ర అని ఇప్పటికి బాధ పడుతున్నవారు ఉన్నారు.
అన్నం జీర్ణం కాక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు
అన్నం తింటూ సంతోషంగా గడిపే వాళ్ళు ఉన్నారు
అన్నమును మీరే అన్నపూర్ణాదేవి గా పూజిస్తారు.
అన్ని దానములలోకి అన్నదానము మిన్న అని మీరే అంటారు.
నా (అన్నము)మనవి • ఇన్ని రకాలుగా మీరే నన్ను పొగుడుతూ ఉంటారు పూజిస్తూఉంటారు. • మరి నేను ప్రసాదించే శక్తిని సరిగ్గా వినియోగించట్లేదు. • ఇప్పుడుమిమ్మల్ని మీరు ప్రశ్నించుకోoడీ. తప్పు నాలో ఉందా? లేక మీలో ఉందా?
పిల్లలు అన్నము ఎంత కావాలంటే అంత తినండి కానీ అంతకు తగ్గ శ్రమించండి. • విమర్శలు కట్టి పెట్టండి.
LIKE OR DISLIKE THE VIDEO NO PROBLEM COMMENTS ARE INVITED SHARE IT & SUBSCRIBE
THANKS FOR WATCHING